
Samantha about Toxic Habits:
హెల్త్, ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ఓపెన్‌గా ఉండే సమంత రూత్ ప్రభు, ఇప్పుడు తన “టాక్సిక్” మొబైల్ రిలేషన్‌షిప్‌పై మాట్లాడింది. ఆమె చెప్పిన మాటలు ఎంతో మందికి ప్రేరణగా మారాయి.
“నేను చాలా మంచి మార్పులు చేసుకున్నాను. కానీ ఫోన్‌కి అలవాటు మాత్రం కంట్రోల్ చేయలేకపోయాను. అది పని అనుకొని ఫోన్ తీసుకునేవాళ్లినే. కానీ అది తప్పు అని అర్థమైంది” అని చెప్పింది సమంత.
ఈ సమస్య నుంచి బయటపడటానికి మూడు రోజుల “సైలెంట్ రిట్రీట్”కి వెళ్లింది. అక్కడ ఫోన్ లేదు, టాక్ లేదు, రీడింగ్ లేదా రైటింగ్ కూడా లేదు. ఆమె మాటల్లో చెప్పాలంటే, “నిజంగా బ్రెయిన్ స్లో అవుతుంది. చాలా రిలీఫ్ ఫీలవుతుంది.”
అంతే కాదు, రీసెంట్‌గా తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్లకు ఘాటు రిప్లై ఇచ్చింది. జిమ్‌లో పుల్‌అప్స్ చేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. “మీకు తక్కువగా అనిపిస్తే మూడు పుల్‌అప్స్ చేయండి. చేయలేకపోతే అర్థం చేసుకోండి!” అంటూ తేల్చేసింది.
ప్రొఫెషనల్‌గా చూస్తే, సమంత ఇటీవల “Citadel: Honey Bunny” లో వరుణ్ ధవన్‌తో కనిపించింది. తన తొలి ప్రొడక్షన్ అయిన “శుభం”లో కేమియో చేసింది. ఇక తెలుగులో “మా ఇంటి బంగారం” విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు, “రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్” అనే యాక్షన్ వెబ్‌సిరీస్‌లోనూ కనిపించబోతోంది.
ALSO READ: Ram Charan మీద దుమ్మెత్తి పోస్తున్న నిర్మాతలు.. ఎందుకు?