HomeTelugu Trendingబిగ్‌బాస్‌లో మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ!

బిగ్‌బాస్‌లో మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ!

Another wild card entry inతెలుగు బిగ్‌బాస్‌-4 ఎంత పాపులర్ అవుతుందో అందరికి తెలిసిన సంగతే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికి ముగ్గురు సెలెబ్రెటీస్ కుమార్ సాయి, అవినాష్, స్వాతీ దీక్షిత్ లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. కుమార్ సాయి, స్వాతిలు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ షోలోకి ప్రముఖ సింగర్ మంగ్లీ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి 7 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 8వ వారంలోకి అడుగు పెట్టింది. ఈవారంలో 4వ వైల్డ్‌కార్డుగా ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు .

తెలంగాణా పాటలతో మంగ్లీ బాగా ఫేమస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ ఇంట్లోకి చాలా లేట్ ఎంట్రీ ఇస్తున్న ఈమె తన ఆటతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి. నిజానికి సీజన్ 3 ముందు నుండి ఈమె ‘బిగ్‌బాస్’కు ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె రాకతో బిగ్‌బాస్‌ షోకి మరింత హైప్‌ వస్తుందని నెటిజన్లు అంటున్నారు.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu