ఫుల్‌ఫాంలో ఉన్న పూజా హెగ్డే

టాలీవుడ్‌ స్టార్ హీరోలందరికీ ఛాయిస్ గా మారిన హీరోయిన్‌ పూజా హెగ్డే. ‘ముకుంద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాతో హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. పైగా ప్రస్తుతం ఉన్న కాజల్, తమన్నా, అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించేయడంతో పూజానే అందరికీ ఫ్రెష్ పెయిర్ లా కనిపిస్తోంది.

అందుకే టాలీవుడ్‌ ఇండస్ట్రీ మొత్తం తమ సినిమాల కోసం తయారుచేసుకునే హీరోయిన్ల జాబితాలో పూజా హెగ్డే పేరును తప్పకుండా చేర్చుకుని వీలైనంత వరకు ఆమెనే ఫైనల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’, మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల ‘మహర్షి’ వంటి పెద్ద చిత్రాల్లో నటిస్తున్న పూజా ప్రభాస్ యొక్క 20వ సినిమాలో సైతం కథానాయకిగా కుదిరింది.

ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ప్రకటించారు. ఇలా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న పూజా ఈ చిత్రాలన్నీ హిట్లుగా నిలిస్తే రెట్టింపు స్టార్ డమ్ సొంతం చేసుకోవడం ఖాయం.