మాస్‌ టైటిల్‌తో మెగా హీరో!

మెగా కుటుంబం నుంచి తాజాగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కుర్రాడు వైష్ణవ్‌ తేజ్‌. మెగా మేనమామల అల్లుడిగా, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడిగా వస్తున్న వైష్ణవ్ తేజ్‌ ప్రీ లుక్‌తోనే ఆకట్టుకున్నాడు. సినిమా లాంచింగ్‌లోనే వైవిధ్యం చూపించారు అనుకుంటే.. కాస్టింగ్‌లోనూ అదే స్థాయిలో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పేరు విషయంలోనూ అదే శైలిలో ఆలోచిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాకు ఊర మాస్‌ టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం.

సానా బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. సినిమా ప్రీలుక్‌లో వైష్ణవ్‌ జాలరిగా కనిపించాడు. దీంతో ఈ ప్రచారం నిజమే అని అనుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడు. చిత్రబృందం ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates