HomeTelugu Newsవిశాల్ సినిమా డిసంబర్ లో!

విశాల్ సినిమా డిసంబర్ లో!

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి
వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
‘ఒక్కడొచ్చాడు’. నవంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితుల
దృష్ట్యా డిసెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి ప్లాన్‌ చేస్తున్నారు. 
నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”ప్రస్తుతం దేశంలో నెలకొని వున్న పరిస్థితుల దృష్ట్యా ఈనెలలో విడుదల
చెయ్యాల్సిన మా ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాన్ని వాయిదా వెయ్యడం జరిగింది. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల
చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో
సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. యాక్షన్‌తో
పాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం నాకు
వుంది” అన్నారు. 
విశాల్‌, తమన్నా, ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె. సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహ నిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu