HomeTelugu Trendingషాక్ ఇస్తున్న విశ్వక్‌ సేన్‌ రెమ్యునరేషన్...!

షాక్ ఇస్తున్న విశ్వక్‌ సేన్‌ రెమ్యునరేషన్…!

Vishwaksen Satire On Ravi And Sreerama Chandra

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయిన సంగతి తెలిసిందే. డిల్ క్లాస్ పెళ్లి కాని యువకుడిగా నటించాడు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పాటలు టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎదురుచూసారు. అనుకున్నట్లుగానే వచ్చి సినిమా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ లో విశ్వక్ రెండు సినిమాలు సైన్ చేసారని వినికిడి. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి కూడా అన్నారు అని టాక్ వినిపిస్తుంది.

‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకు ముందు వరకు రూ. 1.5-2కోట్ల వరకు పారితోషికం తీసుకునే విశ్వక్‌సేన్‌ ఇప్పుడు ఆ రెమ్యునరేషన్‌ను అమాంతం పెంచేశాడట. కొత్త ప్రాజెక్ట్స్‌ కోసం విశ్వక్‌ దగ్గరికి వెళ్తే తన రెమ్యునరేషన్‌ ఇప్పుడు రూ. 3కోట్లు అని చెప్పి నిర్మాతలకు షాక్‌ ఇస్తున్నాడట. అడిగినంత ఇస్తేనే సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu