HomeTelugu NewsVishwak Sen: మన సినిమా గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది

Vishwak Sen: మన సినిమా గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది

Hero vishwak sen interestin

టాలీవుడ్ యువ నటుడు విశ్వ‌క్ సేన్, చాందిని చౌద‌రి హీరోహీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం ‘గామి’. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ సినిమా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఈక్రమంలో ఈ మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గోన్న విశ్వ‌క్ సేన్ టాలీవుడ్ పెద్ద‌లపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా మ‌ల‌యాళం నుంచి ‘ప్రేమ‌లు’ అనే సినిమా తెలుగులో విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ‘ప్రేమ‌లు’, ‘గామి’ సినిమాలు ఒకే టైంలో విడుద‌ల‌య్యాయి.

ఇక ప్రేమ‌లు చూసిన సినీ ప్ర‌ముఖులు ఎక్స్ వేదిక‌గా మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే గామి సినిమాపై ఏ సెలబ్రిటీ స్పందించడం లేదు.. మ‌రోవైపు నెటిజ‌న్లు కూడా సోష‌ల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేయడంతో మూవీ కలెక్షన్స్ తగ్గుతున్నట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా గామి మూవీ ప్రెస్ మీట్‌లో పాల్గోన్న విశ్వ‌క్ సేన్ మూవీపై మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ‘చాలా రిస్క్‌ చేసి ఈ సినిమా తీశాం. ఇది కమర్షియల్‌గా హిట్‌ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఆరేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఇది.

మా సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతాను. మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు. అంటూ విశ్వ‌క్ వెల్ల‌డించాడు. కాగా విశ్వ‌క్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!