HomeTelugu Trendingఫ్యామిలీ అంటూ విష్వక్ సేన్ ట్వీట్ వైరల్

ఫ్యామిలీ అంటూ విష్వక్ సేన్ ట్వీట్ వైరల్

Viswaksen marriage

టాలీవుడ్‌ యంగ్ హీరో విష్వక్సేన్ హీరోగానే కాకుండా దర్శకుడిగానూ నిరూపించుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం విష్వక్సేన్ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం‌ వహిస్తున్నాడు. నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. విష్వక్ సేన్ లుంగీతో మాస్‌లుక్‌ టీజర్ ఆకట్టుకుంటోంది.

విష్వక్సేన్ కుటుంబాన్ని మొదలు పెట్టబోతున్నానంటూ నిన్న చేసిన ఓ ట్వీట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమ, మద్దతుకు నా అభిమానులు, శ్రేయోభిలాషులకు సర్వదా కృతజ్ఞుడిని.

జీవితంలో ఇప్పుడు మరో దశలోకి అడుగుపెట్టబోతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను ఫ్యామిలీని మొదలెట్టబోతున్నాను. వివరాలు త్వరలోనే అంటూ అబ్బాయి, అమ్మాయి కలిసున్న ఎమోజీని ఉంచాడు. దీన్నిబట్టి విష్వక్ సేన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని అర్థం అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu