HomeTelugu Newsబాలయ్యను ఢీకొట్టనున్న చరణ్‌ విలన్‌

బాలయ్యను ఢీకొట్టనున్న చరణ్‌ విలన్‌

Vivek oberoi as a villain iటాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ రోర్ ను కూడా మూవీ యూనిట్ విడుదల చేసింది. కాగా గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు (సింహ, లెజెండ్) వచ్చాయి. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బోయపాటి సినిమాలో విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుదో చెప్పనవసరం లేదు.

అంతే కాకుండా బాలయ్యను ఢీ కొట్టే విలన్ అంటే ఫ్యాన్స్‌ కూడా ఓ రేంజ్ లో ఊహించుకుంటారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్‌ను పేరు వినిపిస్తుంది. వివేక్‌ ఒబెరాయ్‌.. రామ్‌ చ‌ర‌ణ్ ‘విన‌య‌విధేయ‌రామ‌’ సినిమాలో విల‌న్‌గా న‌టించిన మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu