HomeTelugu NewsThis Week Theatrical Releases: పోటీపడనున్న సినిమాలు.. ఎక్కువ బజ్ ఏ మూవీకి ఉందంటే!

This Week Theatrical Releases: పోటీపడనున్న సినిమాలు.. ఎక్కువ బజ్ ఏ మూవీకి ఉందంటే!

This Week Three Theatrical This Week Theatrical Releases,Gam Gam Ganesha,Gangs of Godavari,Bhaje Vaayu Vegam

This Week Theatrical Releases: ఈ సారి సమ్మర్‌కు.. ఎన్నికలు, ఐపీఎల్ పుణ్యమా అని సినిమాలు ఏమీ విడుదల కాలేదు. దీంతో టాలీవుడ్ డల్‌ అయిపోయింది. కొత్త సినిమాల కోసం ఇండస్ట్రీవైపు సినీ అభిమానులు అంత ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన ‘లవ్ మి’ మూవీ కొంత మేర థియేటర్లలో సందడి తీసుకొచ్చింది. కాగా వారం బాక్సాఫీస్‌లో మరింత కళ వస్తుందనే ఆశలు రేగుతున్నాయి. ఈ వీకెండ్‌కు ముందు ఐదు చిత్రాలు షెడ్యూల్ అయ్యాయి. కానీ పోటీ ఎక్కువగా ఉందని సుధీర్ బాబు సినిమా ‘హరోంహర’, కాజల్ మూవీ ‘సత్యభామ’ మూవీలను వాయిదా వేసేశారు.

దీంతో ఈవారం మూడు సినిమాలు రేసులో మిగిలాయి. వీటిలో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.

అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మే 31న విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. ఇప్పుడు రిలీజైన ట్రైలర్ బాగా పేలడంతో హైప్ ఇంకా పెరిగింది.ఈ మూవీ వచ్చే వారానికి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్. ఈ సినిమా రొటీన్‌కు భిన్నంగా అనిపిస్తోంది.

అదే రోజు రిలీజయ్యే ‘భజే వాయు వేగం’, ‘గం గం గణేశా’ లకు ఇప్పటి వరకూ పెద్దగా హైప్ లేదు. ఇవి సగటు హైస్ట్ థ్రిల్లర్స్ లాగా అనిపిస్తున్నాయి. రెండు చిత్రాల మధ్య పోలిక కనిపిస్తోంది. హీరో కార్తికేయ చాలా కాలంగా సరైన సక్సెస్ లేకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి.

ఆనంద్ దేవరకొండ మూవీ విషయానికి వస్తే ‘బేబి’ తరువాత కొంచెం గ్యాప్‌ తీసుకుని వస్తున్న చిత్రం గం గం గణేశా. ఫన్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్‌ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాలో ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.ఈ సినిమాపై పెద్దగా బజ్‌ లేకపోడంతో మైనస్‌గా మారింది. థియేటర్స్‌లోకి వచ్చిన తరువాత టాక్ బాగుంటే ఈ సినిమాలు పుంజుకోవడానికి మంచి ఛాన్సే ఉంటుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu