ఎన్టీఆర్ సినిమాను లాంచ్ చేయనున్న పవన్!

రోజు రోజుకి టాలీవుడ్ లో వాతావరణం చాలా ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఒక పక్క బాహుబలి లాంటి సినిమాలు వరల్డ్ సినిమాకి దీటుగా నిలుస్తుంటే మరోపక్క యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ థాట్స్ తో ఇరగదీస్తున్నారు. ఇక ఇప్పడు స్టార్ హీరోస్ మధ్య కూడా మంచి హెల్తీ కాంపిటేషన్ ఉంటుంది. మొన్నామధ్య బాలయ్య సినిమా ఓపెనింగ్ కి చిరు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఆ తరువాత అదే సినిమాతో పాటు రిలీజ్ అయిన చిరు సినిమాకి బాలయ్య విషెస్ చెప్పాడు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ మూడు పాత్రలతో అదరగొట్టిన జై లవకుశ సినిమా స్పెషల్ గా చూసి ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు రామ్ చరణ్. ఇప్పడు ఇలాంటి మరో రేర్ మూమెంట్ కి ముహూర్తం కుదిరింది.

అదేంటంటే ఎన్టీఆర్,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకి సోమవారం ముహూర్తం పెట్టారు. అయితే ఆ ముహూర్తానికి పవన్ కళ్యాణ్ వస్తాడన్న వార్త ఇప్పడు సంచలనంగా మారింది. ప్రస్తుతం పవన్ 25 వ సినిమాకి కూడా త్రివిక్రమ్ దర్శకుడు కావడం, పైగా పవన్ సినిమాని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని బ్యానర్ ఎన్టీఆర్ సినిమాని కూడా నిర్మిస్తుండడంతో ఇది గాలి వార్త అనడానికి లేదు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ లో కాకుండా నితిన్,సప్తగిరి సినిమాల ఫంక్షన్స్ కి మాత్రమే పవన్ వచ్చాడు. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ సినిమాకి అటెండ్ అవుతుండడంతో ఈ సినిమాపై ఓపెనింగ్ నుండే తారాస్థాయి అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్ ఇప్పడు కొసగిస్తున్న ఫామ్ కి త్రివిక్రమ్ మార్క్ యాడ్ అయితే ఆ మ్యాజిక్కే వేరుగా ఉంటుంది.ఇక ఈ మధ్య ఎన్టీఆర్ కి పవన్ ఫాన్స్ మద్దతు కూడా ఎక్కువగా లభిస్తుంది.సో,ఈ కాంబినేషన్ తో ఈ సినిమాకు సపోర్ట్ కూడా అందిస్తారు PSPK డీవోటీస్.ఇక ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్ లు ఒకే ఫ్రేమ్ లో ఉంటె ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఇప్పటినుండే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసారు ఫాన్స్.