HomeTelugu Big Stories'ఇస్మార్ట్‌ శంకర్‌' సక్సెస్‌ పార్టీపై రజనీ రియాక్షన్‌: వర్మ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీపై రజనీ రియాక్షన్‌: వర్మ

2 20‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీ చూసిన తర్వాత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రియాక్షన్‌ చూడండి’ అంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఓ ఫన్నీ వీడియో షేర్‌ చేశారు. పార్టీ వీడియోను ‘చంద్రముఖి’ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌తో కలిపిన కొత్త వీడియో అది. దీన్ని వర్మ ఆదివారం అభిమానులతో పంచుకున్నారు.

రామ్‌ హీరో పాత్ర పోషించిన ‘ఇస్మార్ట్‌ శంకర్’ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించారు. పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. కేవలం రెండు రోజుల్లో రూ.25 కోట్లకుపైగా రాబట్టిందని యూనిట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సక్సెస్‌ పార్టీలో వర్మ తలపై బీర్‌ పోసుకుంటూ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

నటి ఇలియానాకు నభా నటేష్‌ 2.ఓ వెర్షన్ అని వర్మ అభిప్రాయపడ్డారు. సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో గుర్తింపు పొందిన నభా తర్వాత ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ లో నటించారు. పార్టీలో నభాతో కలిసి దిగిన సెల్ఫీని ఆయన ట్విటర్‌లో ఆదివారం షేర్‌ చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూసిన తర్వాత నభా నటేష్‌ ఇలియానా 2.ఓ అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’ అని ప్రశంసించారు. దీనికి నభా ధన్యవాదాలు తెలిపారు. ‘ధన్యవాదాలు సర్‌.. మీరు సినిమా చూసి ఎంజాయ్‌ చేయడం సంతోషంగా ఉంది. మీ సినిమాలకు నేను పెద్ద అభిమానిని. అలాంటి మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు. దీనికి వర్మ ప్రతిస్పందించారు. ‘నిన్ను కలవడం నాకూ ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి నేను నీ అభిమానిని’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu