HomeTelugu Trending'తలైవా 170' మూవీ టీజర్‌ అదుర్స్‌

‘తలైవా 170’ మూవీ టీజర్‌ అదుర్స్‌

Rajini 170

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తలైవా 170’. జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. నిన్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘వెట్టయన్’ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. ఈ టీజర్‌లో రజినీకాంత్‌ తన స్టైల్‌తో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఏడు పదుల వయస్సులోనూ అదే స్టైల్‌.. అదే స్టైల్ మ్యానరిజాన్ని చూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు తలైవా. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇటీవలే సెట్స్‌లో నుంచి షూటింగ్‌ స్పాట్‌లో రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ స్టిల్‌ను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. తలైవా 170 ముంబై షెడ్యూల్ పూర్తయినట్టు కొన్ని రోజుల క్రితం అప్‌డేట్ కూడా తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో గురు ఫేం రితికా సింగ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ మూవీకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 మూవీ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu