
వైఎస్సార్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బటన్ రెడ్డి.. మరీ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా ?, ముందు వైఎస్సార్ అసలు ఏం చేశారు ?, ఇప్పుడు బటన్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూద్దాం. వైఎస్సార్ గారు ఫ్రీ అనే కాన్సెప్ట్ ను మొదట ప్రవేశ పెట్టారు. అప్పుడు ఆయనకి రాజకీయంగా అది చాలా అవసరం. కాబట్టి, వైఎస్సార్ ఆ దారిలో ముందుకు వెళ్లారు. సరే ఆయన దారి ఏమిటో ఒక ఉదాహరణ రూపంలో చెప్పుకుందాం. ఒక పేద విద్యార్థికి ఒక కంప్యూటర్ కావాల్సి వచ్చింది. సహజంగా దాన్ని కొంటే 30 వేల రూపాయలు అవుతుంది. అదే బాడుగకు తెచ్చుకుంటే నెలకు 3500 రూ.లు. ఎవరైనా ఏది కోరుకుంటారు ?, కానీ వైఎస్సార్ మాత్రం బాడుగకే ప్రాధాన్యం ఇచ్చారు.
ఎలా అంటే.. ఒక రోగికి గుండె శస్త్ర చికిత్స చేస్తే 2 లక్షలు అవుతుంది అనుకుందాం. దాన్ని ప్రైవేట్ ఆస్పత్రికి ఇచ్చారు. నిజానికి అదే డబ్బు పెట్టి ఉంటే.. గుండె శస్త్ర చికిత్సకి అవసరం అయ్యే మొత్తం సామాన్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వచ్చేవి. నేటికీ అందరికీ ఉపయోగపడేవి. కానీ, వైఎస్సార్ తనకు పేరు రావాలని తాపత్రయ పడ్డారు. దీర్ఖ కాలికంగా ప్రజలకు ఉపయోగపడేలా వైఎస్సార్ పనులు చేయలేకపోయారు. అలాగే ఉచిత విద్య కూడా. ఈ క్రమంలో వైఎస్సార్ ప్రభుత్వం అవినీతి మయం అయిపోయింది. ఆ అవినీతిలో ఈదుతూ నానుతూ పైకి వచ్చిన వాడే మన బటన్ మోహన్ రెడ్డి. ఒక వ్యక్తి ఇంత అవినీతి చేయగలడా ? అని నీచులు సైతం ఆశ్చర్యపోయేలా బటన్ రెడ్డి ప్రయాణం సాగింది.
ఈ లోపు ఏనాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం కారణంగా.. మన బటన్ రెడ్డి సీఎం అయ్యాడు. బటన్ల మీద బటన్ల నొక్కుతున్నాడు. రాష్ట్రం పూర్తిగా సంక నాకిపోయింది. బటన్ రెడ్డిది ఏం పోయింది ?, ఆయనది కాకుంటే ఏమైనా దానం చేసేస్తాడు. ఉచితం వల్లే తన తండ్రి ఎదిగాడు అని మన బటన్ రెడ్డి నమ్మకం. అందుకే, ఆ ఉచితాలకు అడ్డు అదుపు లేకుండా యదేచ్చగా డబ్బులు పంచేస్తున్నాడు. ఇక్కడే బటన్ రెడ్డికి గుడ్డి కన్ను కమ్ముకుంది. ఉచితం ఎవరికీ ఇవ్వాలో తెలియదు, అసలు ఎందుకు ఇవ్వాలో తెలియదు. కానీ తెలిసింది ఒక్కటే.. ఉచితం అంతే. నాకు తెలియక అడుగుతున్నాను.. సొంత ఆటో నడిపే వాడికి డబ్బులు ఇస్తారు, కానీ ఎవడిదో లారీ నడిపే వాళ్ళని మాత్రం ఎందుకు కనీసం చూడరు.. ?, ఏ.. వాళ్ళేం తప్పు చేశారు బటన్ రెడ్డి ?
దీనికితోడు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ కల్పన లేదు, కొత్త పరిశ్రమలు రావడం లేదు, విద్యుత్, ప్రాజెక్టులు ఇలా అన్ని గాలికి పోయాయి. మరీ జగన్ రెడ్డి సీఎం కదా.. పోక ఏం చేస్తాయ్ ?, అసలు ఉన్నవాళ్ళకి జీతాలకు డబ్బులు లేవు అంటే.. కొత్త జిల్లాలు ఎందుకో ?, ఎవరికి లాభమో అర్దం కాదు. బహుశా ఇందులో బటన్ రెడ్డికి ఏదో లాభం ఉండి ఉండొచ్చు. ప్రతిపక్షాలు కూడా దీన్ని గమనించలేదు అనుకుంటా. ఈ మధ్య భూగర్భ గనుల తవ్వకాలు యదేచ్చగా జరిగిపోతున్నాయి. కానీ ఎవరి కోసం ?, అసలు ఎటు పోతున్నాయి ? అనేది ఒక్క బటన్ రెడ్డికి తప్ప మరొకరికి తెలియదు. ఇక నాణ్యత లేని మద్యం పంపిణీ గురించి చెబితే.. ఆంధ్రా మద్యం ప్రియుల గుండెలు కుమిలి కుమిలి ఏడుస్తాయి.
అయినా, ఈ మద్యం బ్రాండ్ల తయారీ దారులు ఎవరో తెలియదు, ఇంకెవరు ? మన బటన్ రెడ్డే. అసలకే కొత్త బ్రాండ్లు, ఒక్కోసారి తాగితే ఏమవుద్దో అని భయం. అయినా బటన్ రెడ్డికి మాత్రం సంతోషమే. ఎందుకంటే.. బటన్ రెడ్డి జేబులోకి భారీ మొత్తంలో డబ్బులు వెళ్తున్నాయి కదా. సరే.. నాబోటి వాడికి ఇప్పటికీ అర్ధం కానీ ఓ బ్రహ్మపదార్థం ఏమిటంటే.. అసలు ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి డబ్బులు ఎందుకు వేస్తున్నారో తెలియదు ?. అన్నట్టు ఒక్కో సినిమా కి ఒక్కో ఆర్డినేన్స్, ఒక్కో రేట్ ?, ఇలా ఎన్నో సిత్రాలు ఎన్నోన్నో విచిత్రాలు. ఇవన్నీ ఒక్క బటన్ రెడ్డికే సాధ్యం.













