Homeపొలిటికల్అసలు జగన్ రెడ్డి ఎలాంటి వాడంటే ?

అసలు జగన్ రెడ్డి ఎలాంటి వాడంటే ?

What kind of person is Jagan Reddy

జగన్‌ అసలు నాయకుడా ? లేక, రాజారెడ్డి నేరాలకు వారసుడా ? అని నిత్యం ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి స్వభావం ఆయన తాతయ్య రాజారెడ్డి స్వభావం ఒక్కటే అని అంటుంటారు. మరి ఈ డిజిటల్ జనరేషన్ రాజారెడ్డి ఎవరో తెలియదు కదా ?. మరి జగన్ రెడ్డి స్వభవాన్ని ప్రజలు అర్ధం చేసుకునేది ఎలా ?, అందుకే.. జగన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ఈ జనరేషన్ కి కూడా అర్థమయ్యేలా చర్చిద్దాం.

అసలు జగన్ రెడ్డి ఎలాంటి వాడంటే.. ప్రజల మీద ముఖ్యంగా పేద ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటించే వ్యక్తి. ప్రజలకు ఎవరైనా ఏమైనా ఇవ్వాలంటే అడ్డం పడే వ్యక్తి. పాత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను ఇస్తే.. చంద్రబాబుకు పేరు వస్తోందని ఆ ఇళ్లను గాలికి వదిలేసిన వ్యక్తి. అంతేనా ?, అన్నా కాంటీన్ లను ధ్వంసం చేయించిన వ్యక్తి. అంతకు మించి సాక్షి పత్రిక నాది కాదు అని నిండు అసెంబ్లీలో ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి. ఏ ఆశలు, ప్రత్యేక హోదా, ఉద్యోగులకు పెన్షన్ చూపించి గెలిచాడో, వాటిని మొదటి రోజే ఇవ్వడం కుదరదని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి.

మిగతా పార్టీల మీద, ఆ పార్టీల నాయకుల మీద, ఉద్యోగుల మీద, తెరాస మీద, బీజేపీ మోదీ – షా ల మీద తనకు వున్న మంచి చెడ్డ అభిప్రాయాలను తొట్టి గ్యాంగ్ ద్వారా, సాక్షి లాంటి మీడియా ద్వారా ప్రజాభిప్రాయంలా మలచగలిగే తెలివైన వ్యక్తి. చెత్తగా తెలుగు (పేపర్ చూసి ) మాట్లాడగలిగే వ్యక్తి. ఎన్నిసార్లు అధికారులు కోర్టులో తిట్టు తిన్నా.. అదే తప్పు పదే పదే అధికారులతో చేయించగల వ్యక్తి మన జగన్ రెడ్డి.

కోర్టులలో ఒక్క కేసు ఓడిపోతే రాజీనామా చేసిన ముఖ్యమంత్రులు పిచ్చోళ్ళని, ఎన్ని కేసులు ఓడిపోయినా, రాజీనామా చేయమని అడిగే పార్టీ లేకుండా, చేయగలిగిన దమ్మున్నోడు మన జగన్ రెడ్డి. అంతేనా ?, సార్ కు ప్రజాస్వామ్యం అంటే ప్రేమ ఎక్కువ. ప్రతిపక్షాలు ఇంట్లో ఉండాలి లేదా జైలులో ఉండాలి అనే సిద్ధాంతకర్త మన జగన్ రెడ్డి. అంతేనా… సానుభూతి కోసం సొంత మనుషులను సైతం త్యాగం చేయగల వ్యక్తి మన జగన్ రెడ్డి.

పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. ఒకరికి నచ్చింది అందరికీ నచ్చాలనీ లేదు, ఒకరికి నచ్చనిది అందరికీ నచ్చకుండా ఉండాలనీ లేదు. ఎవరి ఆలోచన వారిది, ఎవరి ధోరణి వారిది, ఎవరి సిద్ధాంతాలు వారివి. కానీ అదేంటో.. జగన్ రెడ్డికి నచ్చింది ఎవ్వరికీ నచ్చడం లేదు. చివరకు ఆయనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు షర్మిలకు కూడా. అయినా జగన్ రెడ్డిని ఎవరూ శాసించలేరు. ఆయన నిర్ణయాలను ఎవరూ కాదనలేరు. దటీజ్ జగన్ రెడ్డి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu