Prithviraj Sukumaran to Fahadh Faasil: పూర్వం తెలుగు సినిమాల్లో విలన్ అంటే భయంకరంగా ఉండే వాడు.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. హీరోలకు పోటీగా విలన్‌లు మారిపోయారు. సినిమాల్లో ఇద్దరికీ సమానమైన పాత్రలు దక్కుతున్నాయి. కాగా ఒక్కప్పుడు కేవలం హిందీ నటులు మాత్రమే టాలీవుడ్‌లో విలన్‌లుగా నటించే వారు. పలు దశాబ్ధాల పాటు ఈ ట్రెండ్ కొనసాగింది. వారికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది.
ఆ తరువాత కాలక్రమంలో తెలుగు హీరోలు శ్రీకాంత్..జగపతి బాబు లాంటి వారు విలన్లగా టర్న్ అవ్వడంతో బాలీవుడ్ నటుల హవా కాస్త తగ్గింది. కొన్నాళ్ల పాటు వీళ్లు సీరియస్ విలన్లుగా నటించారు. అయితే ఇప్పుడీ ట్రెండ్ కూడా మారిపోయింది.
తాజాగా టాలీవుడ్ లో విలన్‌గా మాలీవుడ్ నటుల హవా నడుస్తుంది. ఒకప్పుడు మలయాళం హీరోల సినిమాలు మాత్రమే.. తెలుగులో అనువాదమయ్యేవి. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేశ్ గోపీ లాంటి వారు అలా పరిచయమైనవారే. అటుపై మలయాళం నుంచి హీరోయిన్‌లు ఎంట్రీలు కూడా ఎక్కువైయ్యాయి. అయితే వారు ఇక్కడ నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది.
ఈ మధ్య కాలంలోనే వాళ్లకు సక్సెస్ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మలయాళం హీరోయిన్ల వెల్లువ అంతకంతకు ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే విలన్ల ఎంట్రీలు కూడా పెరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహాద్ ఫాసిల్ జోజు జార్జ్, షైన్ టామ్ చాకో వంటి వారు ఇక్కడ సత్తా చాటుతున్నారు. పృథ్వీరాజ్ చాలా అనువాద సినిమాలతో టాలీవుడ్ కి బాగా సుపరిచితమైన నటుడు.
పృథ్వీరాజ్ సలార్ సినిమాతో మరింత ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సలార్ -2 లో నటిస్తున్నాడు. అలాగే ఫహాద్ ఫాజిల్ ఎంతో ట్యాలెంటెడ్ యాక్టర్. పుష్ప సినిమాతో ఆయన టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప-2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత పృథ్వీ…పహాద్ లకు విలన్లగా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో గురించి తెలిసిందే. వైవిథ్యమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అటుపై ‘రంగబలి’ లోనూ నటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ – బాబీ సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే.. ‘సలార్ 2’ లోనూ ఛాన్స్ అందుకున్నాడు. మరో రెండు మూడు కొత్త ప్రాజెక్టులలోను అతని పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో మలయాళం నుంచి మరికొంతమంది నటులు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.