హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టు సానుకూలత..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు సానుకూలత వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… డిసెంబర్ 15వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది సుప్రీం కోర్టు ధర్మాసనం.. డిసెంబర్15 నాటికి అమరావతిలో తాత్కాలిక కోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది… మార్చి/ఏప్రిల్ నాటికి స్టాఫ్ క్వార్టర్స్, జడ్జిల నివాసాలు నిర్మిస్తామని కోర్టుకు తెలిపింది. విభజన జరగకుండా కొత్త జడ్జీల నియామకం జరిగితే మళ్లి సమస్యలు ఎదురౌతాయి, వీలైనంత త్వరగా విభజన పూర్తయితే మంచిదని జస్టిస్ ఏకే సిక్రీ అభిప్రాయపడ్డారు.