HomeTelugu Newsరణ్‌వీర్‌కు నటరాజ్‌ షాట్‌ మెలకువలు నేర్పిస్తున్న కపిల్‌దేవ్‌

రణ్‌వీర్‌కు నటరాజ్‌ షాట్‌ మెలకువలు నేర్పిస్తున్న కపిల్‌దేవ్‌

9 5మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ’83’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాలో కపిల్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ పోషిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు. 1983లో కపిల్‌ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్‌ ఎలా సాధించిందనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.

కాగా క్రికెట్‌లో శిక్షణ నిమిత్తం రణ్‌వీర్‌తోపాటు ఇందులో నటిస్తున్న మిగిలిన నటీనటులు (రీల్‌ క్రికెట్‌ జట్టు) హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. కాగా అక్కడ రణ్‌వీర్‌కు కపిల్‌ క్రికెట్‌ మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి మైదానంలో దిగిన ఫొటోలను రణ్‌వీర్‌ పంచుకుంటూ.. ‘లెజెండ్‌’ అని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా నటరాజ్‌ షాట్‌ సాధన చేస్తున్నామంటూ వీడియోను షేర్‌ చేశారు. 2020 ఏప్రిల్‌ 10న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu