ప్రముఖుల కోసం ప్రియాంక నిక్‌ల రిసెప్షన్‌..!

ప్రియాంక చోప్రా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ లు ఈనెల 2 వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ముంబయిలో సన్నిహితులకు, కుటుంబీకులకు మాత్రమే వివాహ విందును ఇచ్చారు. గురువారం రాత్రి బాంద్రాలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం మరో విందును ఏర్పాటుచేశారు. ఈ విందులో సినీ ప్రముఖులు దీపిక పదుకొణె, రేఖ, హేమామాలిని, పరిణీతి చోప్రా, రణ్‌వీర్‌ సింగ్, కాజోల్‌, అనుష్క శర్మ, సల్మాన్‌ ఖాన్‌, ప్రముఖ గాయని ఆశా భోంస్లే, ఏ.ఆర్‌ రెహమాన్‌, తమన్నా, షాహిద్‌ కపూర్‌, మీరా రాజ్‌పుత్‌, కత్రినా కైఫ్‌, నటుడు, కాంగ్రెస్‌ ఎంపీ‌ రాజ్‌ బబ్బర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తదితరులు హాజరయ్యారు