HomeTelugu Newsభారత్‌లో అన్‌లాక్‌ 3.0 మరికొన్నిటికి అనుమతి

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మరికొన్నిటికి అనుమతి

Unlock 3.0 guidelines Curf

భారత్‌లో అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించిన కేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేయనుంది. అయితే కరోనా నిబంధనలను పాటించాలని పేర్కొంది. ఆగస్ట్ 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. వందే భారత్ మిషన్‌ కింద అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయని తెలిపింది. ఆగస్ట్‌ 31 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుంది. అలాగే మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు కూడా ఆగస్ట్ 31 వరకూ మూసి ఉంచాలని ప్రకటించింది. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా సామాజికదూరంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చని మార్గదర్శకాలలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu