HomeTelugu Newsరాయ్‌ లక్ష్మి 'పాపా నీకేందంటే ఇష్టం..' సాంగ్‌

రాయ్‌ లక్ష్మి ‘పాపా నీకేందంటే ఇష్టం..’ సాంగ్‌

3 31ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి’. ఈ చిత్రానికి కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ మూవీ లోని తొలి లిరికల్‌ పాట విడుదలైంది. ‘పాపా నీకేందంటే ఇష్టం..’ అంటూ సాగే ఈ పాట కుర్రకారును ఆకట్టుకుంటోంది. మాస్‌ హంగులు జోడించి ఈ పాటను చిత్రించారు. పూజిత పొన్నాడ, కార్తిక్‌, ప్రవీణ్‌, మధునందన్‌, బ్రహ్మాజీ, ‘జబర్దస్త్‌’ మహేష్‌‌, జెమిని నరేష్‌ తదితరులు సహాయ పాత్రలు పోషించారు.

హరి గౌర సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ, హరి గౌర కలిసి ఆలపించారు. ఏబీటీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రాయ్‌ లక్ష్మి. ‘ఖైదీ నెం 150’ లో ‘రత్తాలు..’ పాటలో మెరిసిన లక్ష్మి ఆ తర్వాత ‘జూలీ 2’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. చాలాకాలం తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు సినిమా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి’. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu