పూనం కౌర్ పై నిర్మాత ఫైర్!

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన పూనం కి సరైన బ్రేక్ దక్కలేదు. తెలుగులో అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తోన్న ఈ భామ ఇప్పుడు తమిళంలో ‘నండు ఎన్ నంబన్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పుడు పూనం ప్రవర్తన పట్ల చిత్ర దర్శకనిర్మాతలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా నిర్మాతలతో గొడవపడి చెప్పాపెట్టకుండా.. ఆమె షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయిందట. దీంతో పూనం పై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయనున్నట్లు డైరెక్టర్ ఆండాళ్ రమేష్ వెల్లడించారు. 
‘నండు ఎన్ నంబన్’ పేరిట ఓ సినిమా ప్లాన్ చేశామని, తన కాస్ట్యూమ్స్ తానే డిజైన్ చేసుకుంటానని చెప్పిన పూనం అకస్మాత్తుగా ఖర్చు పెంచేసిందని, షూటింగ్ లో గొడవ చేసిందని.. ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోవడంతో తమకు నష్టం కలిగిందని దర్శకుడు తెలిపారు. ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. మరి ఈ విషయంపై పూనం ఎలా స్పందిస్తుందో.. చూడాలి!