ఆ సినిమా కోసం వెనక్కి తగ్గిన విజయ్‌ దేవరకొండ

యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు ఈహీరోకి ఉన్న క్రేజ్ పెరుగుతున్నది. క్రేజ్ తో పాటు పెర్ఫార్మన్స్ కూడా పెరుగుతున్నది. దీంతో విజయ్ సినిమాలకు డిమాండ్‌ పెరిగింది. కాగా ఈ హీరో ‘డియర్ కామ్రేడ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా అంతా పూర్తయింది. జులై 19 వ తేదీన విడుదల చేయాలనీ అనుకున్నారు.

కానీ, అదే వారంలో డిస్ని లయన్ కింగ్ సినిమా ఉండటంతో విజయ్ తన సినిమాను వాయిదా వేసుకున్నారట. ఎప్పుడు రిలీజ్ ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పుడున్న సినిమాలకు తెలుగు మార్కెట్ తో పాటు ఓవర్సీస్, ముల్టీప్లెక్స్ మార్కెట్ కూడా అవసరం. డిస్ని నుంచి వస్తున్న చిత్రం కావడం, పైగా విజువల్ వండర్ గా లయన్ కింగ్ తెరకెక్కడంతో కలెక్షన్లు భారీగా ఉంటాయి. ఆ సమయంలో డియర్ కామ్రేడ్ విడుదల చేస్తే.. అది వసూళ్లపై దెబ్బ పడుతుంది. అందుకనే సినిమాను వాయిదా వేసుకున్నారట. తెలుగు సినిమాల నుంచి పోటీ లేకపోయినా.. డిస్ని, మార్వెల్ సంస్థల నుంచి వస్తున్న సినిమాలు కావడంతో కలెక్షన్లపై ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి సినిమాను వాయిదా వేశారు.