రైటర్, దేవుడు ఒక్కడే: డైమండ్ రత్నంబాబు

‘పాండవులు పాండవులు తుమ్మెద’,’ఈడో రకం ఆడో రకం’ వంటి చిత్రాలతో డైలాగ్ రైటర్ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా చేస్తోన్న ‘లక్కున్నోడు’ సినిమాకు డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఆయన పుట్టినరోజు సంధర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.
నేపధ్యం..
కృష్ణా జిల్లాలో పుట్టాను.  ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ వంటి వారు కూడా అక్కడే పుట్టారు. అక్కడ పుట్టిన వారంతా కాస్త వెరైటీగా ఉంటారు. చిన్నప్పటి నుండి సాహిత్యమంటే చాలా ఇష్టం. రామాయణాన్ని విమర్సత్మకంగా రివర్స్ లో రాసిన రంగనాయకమ్మ గారి రైటింగ్ స్టయిల్ నాకు బాగా నచ్చింది. అందుకే నా డైలాగులు కూడా రివర్స్ లోనే ఉంటాయి.
ఇండస్ట్రీలో సంపాదించిన ఆస్తి అదే.. 
దేవదాసు చితానికి అసిస్టెంట్ గా పని చేశాను. జి.నాగేశ్వరరెడ్డి గారి సినిమాలకు గోస్ట్ రైటర్ గా పని చేశాను. శ్రీవాస్ గారు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రానికి రైటర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆయనే నాకు మంచు ఫ్యామిలీను పరిచయం చేశారు. వీరబధ్రం గారు, ఎస్వీ కృష్ణారెడ్డి ఇలా అందరూ నన్ను ప్రోత్సహిస్తూ.. క్రెడిట్ ఇచ్చారు. ఇప్పటివరకు నేను ఇండస్ట్రీలో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే
అది మోహన్ బాబు ఫ్యామిలీకు నేను పరిచయం కావడమే..
ఆ ఇబ్బంది అనుభవించాల్సిందే.. 
గోస్ట్ రైటర్ గా ఉన్నప్పుడు టాలెంట్ కు తగ్గ పేరు రాదు. గోస్ట్ రైటర్ గా పని చేసే ప్రతి ఒక్కరూ ఆ ఇబ్బందిని అనుభవించాల్సిందే.. అయినా ఆ ప్రాసెస్ లో పేరు కంటే వర్క్ నేర్చుకోవడమే ఎక్కువ ఉంటుంది. నాకు దొరికిన దర్శకులు మంచి వారు కావడంతో నేను ఆ బాధను పెద్దగా భరించలేదు.
ఆ రెండూ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయి.. 
రైటర్, డైరెక్టర్ అనే వారు కలిసి ఉండాలి. టీం విజయం కోసం పాటు పడాలి. టీం గెలిస్తే కెప్టెన్ కప్
అందుకుంటాడు. ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం చాలా మంది రైటర్స్, దర్శకులుగా మారుతున్నారు. ప్రతి రైటర్ లోను ఓ దర్శకుడు ఉంటాడు. ప్రతి దర్శకుడిలోనూ ఓ రైటర్ ఉంటారు. సమయం బట్టి కోణాలు బయటకు వస్తాయి. కాలే కడుపు.. ఖాళీ జేబు.. గురువు లాంటివి. మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తాయి.
రైటర్, దేవుడు ఒక్కడే.. 
నా వరకు రైటర్, దేవుడు ఒక్కడే. దేవుడు మనుషులను సృష్టిస్తే.. రైటర్ పాత్రలను సృష్టిస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా రైటర్స్ కోసం ఖర్చుపెడితే మంచి కథలు వస్తాయి. భవిష్యత్తులో కథలు రాసుకునే దర్శకులే మంచి స్థాయికి ఎదుగుతారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ అంటే చాలా ఇష్టం. ట్రెండింగ్ కథలను కమర్షియల్ గా చూపిస్తూ.. ఆదరణ పొందుతున్నారు.
డైరెక్టర్ గా పని చేస్తా.. 
ప్రస్తుతం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’,’లక్కున్నోడు’ చిత్రాలకు పని చేస్తున్నా.. ఈ సినిమాల తరువాత నేనే డైరెక్ట్ చేయాలనుకుంటున్నా.. కథలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద హీరోలతో చేయాలనుంది. డైరెక్టర్ గా మారినా.. రైటర్ గా నా జర్నీ కొనసాగిస్తూనే ఉంటా..
 
 
 
CLICK HERE!! For the aha Latest Updates