రానా ఆంజనేయుడి అవతారం!

బాహుబలి సినిమా తరువాత రానా తన సినిమాల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మెప్పును పొందాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో జోగేంద్ర పాత్రతో ఇమిడిపోయి అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను తన నటనతో మెప్పించాడు. గుణశేఖర్ డైరెక్ట్ చేయబోతున్న చిత్రంలో హిరణ్యకశ్యప పాత్రలో రానాను తీసుకోవాలని భావిస్తున్నారు. అలానే మంచు ఫ్యామిలీ చాలా కాలంగా ‘రావణ’ అనే చిత్రాన్ని రూపొందించాలని భావిస్తోంది. 
మోహన్ బాబు ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆయన సినిమాలో రావణుడి పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఆంజనేయుడి పాత్ర కోసం రానాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. రానా కూడా తన పాత్ర పట్ల సముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, రానాలతో పాటు కొంతమంది బాలీవుడ్ తారలు కూడా నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.