HomeTelugu Trendingబిగ్‌బాస్‌-5 విన్నర్‌ సన్నీ మూవీ 'సకల గుణాభిరామ' నుండి సాంగ్‌ విడుదల

బిగ్‌బాస్‌-5 విన్నర్‌ సన్నీ మూవీ ‘సకల గుణాభిరామ’ నుండి సాంగ్‌ విడుదల

Ye Porapato Lyrical from Sa
తెలుగు బిగ్‌బాస్-5 విన్నర్ విజె సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సకల గుణాభిరామ’. అషిమా నార్వేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. అంతేకాకుండా సన్నీ నిన్ననే బిగ్ బాస్ నుంచి బయటికి రావడంతో తమ హీరోకి ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేసి స్వాగతం పలికారు మూవీ యూనిట్‌.

ప్రముఖ దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ని రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ పొరపాటో అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. విజువల్స్ చూస్తుంటే ఈ సాంగ్ సాడ్ సాంగ్ లా కనిపిస్తోంది. అనుదీప్ సంగీత దర్శకత్వంలో సింగర్ ప్రదీప్ పాడిన ఈ పాట ఆద్యంతం మనసును హత్తుకొంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరి బిగ్ బాస్ విన్నర్ గా గెలిచినా సన్నీ మొదటి సినిమాతోనే హీరోగా విజయం సాధిస్తాడా ..? లేదా ..? అనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu