గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్‌

రాజ్‌భవన్‌కి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గవర్నర్‌ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల తర్వాత జరగుతోన్న పరిణామాలు, ప్రభుత్వ పాలనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీమ్. గవర్నర్‌తో భేటీ అయిన వైసీపీ బృందంలో వైఎస్ జగన్‌తో పాటు కోన రఘుపతి, శ్రీకాంత్ రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కార్మూరు, అవంతి, పెద్దిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, సజ్జల తదితరులున్నారు. కాగా, ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.