‘#మీటూ’ ఫ్యాషన్‌ అయిపోయింది: సుభాష్‌ ఘాయ్

ఈ మధ్యకాలంలో ‘#మీటూ’ ఉద్యమం ఫ్యాషన్‌ అయిపోయిందని ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సుభాష్‌ ఘాయ్ అంటున్నారు‌. కొన్నేళ్ల క్రితం సుభాష్‌ జ్యూస్‌లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సుభాష్‌ స్పందిస్తూ.. ‘అందరికీ ‘మీటూ’ అనేది ఫ్యాషన్‌ అయిపోయింది. ఇతరుల పేర్లు చెడగొట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. నాకు మహిళల పట్ల గౌరవం ఉంది.

ఇంట్లో అయినా పని చేసే ప్రదేశాల్లో అయినా మహిళలను గౌరవిస్తాను. నాపై ఆరోపణలు చేస్తున్న యువతి కోర్టుకు వెళ్లి ఆధారాలు చూపించాలి. అప్పుడే న్యాయం గెలుస్తుంది. లేదంటే నేనే ఆమెపై దావా వేస్తాను’ అని వెల్లడించారు. కాగా ఇప్పటికే ప్రముఖులు ‘మీటూ’లో నానా పటేకర్‌, అలోక్‌ నాథ్‌, కైలాశ్‌ ఖేర్‌, రజత్‌ కపూర్‌, వికాస్‌ బెహల్‌, సుభాష్‌ కపూర్‌, క్రీడాకారులు అర్జున రణతుంగ, మలింగ పేర్లు బయటకు వచ్చాయి.