Homeపొలిటికల్అద్దంకి 'సిద్దం' సభకు భారీ జనం.. మరి గ్రీన్ మ్యాట్‌ ఎందుకు?

అద్దంకి ‘సిద్దం’ సభకు భారీ జనం.. మరి గ్రీన్ మ్యాట్‌ ఎందుకు?

jagan

ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌ నిన్న ‘సిద్ధం’ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు లక్షలకు లక్షలు జనం తరలి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అంతా.. గ్రాఫిక్స్‌ మాయ అంటున్నారు. సభలో జరిగే లోటుపాట్లు బయటకు పొక్కకుండా ఉండడానికి వైసీపీ మరో కొత్తమార్గాన్ని ఎంచుకుంది అని అంటున్నారు.

ముందుగా.. మేదరమెట్ల వద్ద 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించిన వైసీపీ నేతలు.. చివరకు 50 ఎకరాల్లోనే సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. జనాన్ని తరలించేందుకు పెద్దఎత్తున ఏర్పట్లు చేసిన అయినా ఆశించినంత జనం రాలేదు. 50 ఎకరాల సభా ప్రాంగణంలో దాదాపు 2.50 లక్షల మంది జనం పడతారన్నది సాధారణ అంచనా.

ఈ సభా ప్రాంగణం పూర్తిగా నిండలేదు. సీఎం జగన్‌ మాట్లాడే సమయంలో ముందుభాగాన కార్యకర్తలు కనిపించగా, వెనుక భాగమంతా కాళీగా కనిపించింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నేతలు.. జనాలని ఎక్కువగా చూపించేందుకు టెక్నాలజీని వాడుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సభాప్రాంగణం మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ గ్రీన్‌ మ్యాట్‌ పరిపించారు. గ్రాఫిక్స్‌ మాయాజాలంతో సిద్ధం సభకు లక్షలాది మంది జనం పోటెత్తినట్టు చూపే ప్రయత్నం చేశారు.

కొన్ని డ్రోన్‌ షాట్స్‌లో జనం లేక ఖాళీగా ఉన్న ప్రాంగణం కనిపించింది అంటున్నారు. గతంలో జరిగిన సిద్ధం సభకు లక్షల మంది జనం వచ్చారని వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే సెల్‌ టవర్‌ ఆధారంగా ఒరిజినల్‌గా సభకు హాజరైన జనం సంఖ్యను గణాంకాలతో టెక్నాలజీ నిపుణులు తేల్చిచెప్పేశారు. అధికార పార్టీ చెప్పిన సంఖ్యకు అక్కడ వాస్తవంగా హాజరైన జనానికి పొంతనలేదు. దీంతో వైసీపీ ఈసారి సిగ్నల్స్‌ నిలిపేసే కొత్త ఎత్తుగడకు తెరలేపిందని తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu