Homeపొలిటికల్YS Sunitha: వివేకా ఆఖరి కోరిక .. అందుకే పోటీ నుంచి తప్పుకోండి

YS Sunitha: వివేకా ఆఖరి కోరిక .. అందుకే పోటీ నుంచి తప్పుకోండి

YS Sunitha

YS Sunitha: కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్‌ సునీత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తే ఎలా? దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చేస్తారా? అని మండిపడ్డారు. రాజకీయాలే కాకుండా ప్రతి ఒక్కరికీ జీవితం కూడా ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు.

”తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నామని అవినాష్‌ అంటున్నారు. వివేకా కుటుంబం గురించి ఏమైనా ఆలోచించారా? వివేకా హత్యకేసు దర్యాప్తు గురించి పోలీసులతో, సీబీఐతో ఎప్పుడైనా మాట్లాడారా? గూగుల్‌ టేకౌట్‌ ఫ్యాబ్రికేటెడ్‌ అని అంటున్నారు. గూగుల్‌ టేకౌట్‌ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ తయారు చేశాయి.

అవినాష్‌పై సర్వే ఆఫ్‌ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు కూడా కోపం ఉంటుందా? మీ ఫోన్‌ దర్యాప్తు అధికారికి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. సాక్షులు చనిపోతున్నారనే కేసును తెలంగాణకు మార్చారు.. గూగుల్‌ టేకౌట్‌ ప్రకారం.. అవినాష్‌ రెడ్డి ఇంట్లో గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వివేకా హత్య ఘటనపై జగన్‌కు ఏమని సమాచారం ఇచ్చారు.

గుండెపోటు అని చెప్పారా? హత్య అని చెప్పారా? హత్య అని తెలిస్తే జగన్‌ వెంటనే డీజీపీకి ఫోన్‌ చేయాలి కదా. సిట్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చానని అవినాష్‌ చెప్పారు. అర్థం పర్థం లేని స్టేట్‌మెంట్లు రాసుకున్నారు. అందుకే కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. ఏ స్టేట్‌మెంట్‌ అయినా కోర్టులో నిరూపించాలి. సాక్షులు చనిపోతున్నారన్న కారణంతో ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీం కోర్టు మార్చింది. ఘటనాస్థలంలో శివప్రకాష్‌రెడ్డి లేరు. ఎవరో చెప్పింది చెప్పి ఉండొచ్చు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.

మీకోసం వివేకా ప్రచారం చేశారన్నారు. అది నిజమే. మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారు. అవినాష్‌ ఎంపీగా.. జగన్‌ సీఎంగా ఉన్నారు. మాకు న్యాయం చేశారా? వివేకా చేసిన మంచిపనుల గురించి ఈ ఐదేళ్లలో ఒక్కమాట చెప్పారా? మీ కోసం కష్టపడిన వ్యక్తి గురించి ఒక్కసారైనా మీ పత్రికలో రాశారా? పార్టీ కోసం ఎంతో కష్టపడిన షర్మిలకు 2014లో సీటు ఎందుకు ఇవ్వలేదు? ప్రజలకు ఏం చేశారని అవినాష్‌రెడ్డికి సీటు ఇచ్చారు.

వివేకా ఆఖరి కోరిక తీర్చే బాధ్యత మీకు లేదా? ఆ అవకాశం అవినాష్‌కు ఉంది. పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతివ్వండి. కడప జిల్లా ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా హంతకులకు ఓటు వేయొద్దు. మీకోసం పోరాడే వారికి ఓటు వేయండి. మేం సీబీఐని ప్రభావితం చేస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా? ఐదేళ్లుగా కేసు ముందుకెళ్లడం లేదంటే ఎవరి సత్తా ఏంటో అర్థమవుతోంది. వివేకాను దూరం పెట్టామని విమర్శిస్తున్నారు. నా భర్త, తండ్రి కలిసి కొరియా ట్రిప్‌ వెళ్లారు. దూరంగా ఉంచితే ఎలా కలిసి ప్రయాణం చేస్తారు?” అని సునీత ప్రశ్నించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu