అతడి వైఖరిపై మహేష్ అసంతృప్తి!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వారి మనసును నొప్పించకుండా పనులు చేయించుకోవాలి. లేదంటే కష్టమవుతుంది. ఇక వారి దగ్గర పని చేసే మేనేజర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా అల్లు అర్జున్ మేనేజర్, నిర్మాత అయిన బన్నీవాసు వ్యవహరిస్తోన్న తీరు పట్ల మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే బన్నీ నటిస్తోన్న ‘నా పేరు సూర్య’, మహేష్ బాబు నటిస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమాలు ఒకేరోజు(ఏప్రిల్ 27) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ‘నా పేరు సూర్య’ చిత్ర నిర్మాతలు ఈ విషయంపై కూర్చొని చర్చించుకుందామని మహేష్ అండ్ టీం తో అన్నారు.
అయితే ఓ పక్క ఇలాంటి మాటలు చెబుతూనే మరోపక్క ఏప్రిల్ 26న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం మహేష్ బాబుకి నచ్చలేదని తెలుస్తోంది. దీంతో తమ సినిమాను కూడా అదే రోజున విడుదల చేయమని సూచించినట్లు సమాచారం. అందుకే వెంటనే ‘భరత్ అనే నేను’ టీం కూడా రిలీజ్ డేట్ ఏప్రిల్ 26 అంటూ ప్రకటించింది. ఈ ఊహించని పరిణామానికి బన్నీ క్యాంప్ షాక్ అయింది. మళ్ళీ ఈ విషయంపై మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ మహేష్ మాత్రం ఫిక్స్ అయిపోయాడట. అదన్నమాట మేటర్.