ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి..?

‘బాహుబలి’ వంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి నుండి రాబోయే తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది..? ఆ సినిమాలో హీరో ఎవరు..? ఇలాంటి విషయాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. కానీ ఈ విషయాలపై అటు రాజమౌళి గానీ ఆయన సన్నిహితులు గానీ ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో రాజమౌళి సినిమా చేస్తాడని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆయన బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా తన నెక్స్ట్ సినిమా కోసం ఓ స్పెషల్ ప్లాన్ వేస్తున్నాడట. 
ఇద్దరు స్టార్ హీరోలతో ఆయన ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అందులో ఒకరు బాలీవుడ్ హీరో కాగా, మరొకరిని సౌత్ నుండి తీసుకోవాలనుకుంటున్నాడు. తద్వారా సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రాజమౌళి గతంలో ప్రకటించినట్లుగా ఈ సినిమాలో ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవట. అందుకే స్టార్ క్రేజ్ తో సినిమాకు నేషనల్ వైడ్ గా గుర్తింపు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ హీరోలు ఎవరనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికార ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.