అలాంటి వాళ్ళని చెప్పుతో కొడతా: మంచు లక్ష్మీ

నటి, నిర్మాత మంచు లక్ష్మీ తన పై, తన కుటుంబ సభ్యులపై కానీ రూమర్స్‌ పుట్టించే వాళ్ళని చెప్పుతో కొడతానంటోంది. సోషల్ మీడియాలో మంచు లక్ష్మి వ్యక్తిత్వం పై అలాగే మంచు కుటుంబం పై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం తెప్పిస్తున్నారు. కొంతమంది అయితే అదేపనిగా మంచు లక్ష్మి ని ట్రోల్ చేస్తున్నారు దాంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన మంచు లక్ష్మి అటువంటి వాళ్ళను చెప్పులతో కొడతానని , చంపేస్తానని అంటోంది . సోషల్ మీడియా వల్ల లాభాలతో పాటుగా ఇలాంటి నష్టాలు కూడా ఉన్నాయని ఎవరినీ అనవసరంగా విమర్శించాల్సిన అవసరం లేదని అంటోంది .

నా గురంచి, మా ఫ్యామిలీ గురించి కానీ మీకేం తెలుసు? ఎందుకు మా వ్యక్తిగత జీవితల్లో తల దురుస్తున్నారు? యు ట్యూబ్‌లో ఫోటోలను మార్పింగ్‌ చేసి మమ్మల్ని ఎందుకు చులకన చేస్తున్నారు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేసింది మంచు లక్ష్మి. మా కుటుంబాని ట్రోల్‌ చేసే వాళ్లంటే నేను సివంగి లా మారతానని నిప్పులు చెరుగుతోంది. మంచు లక్ష్మి ఆవేదనలో నిజం లేకపోలేదు. తమకు నచ్చినవాళ్లని పొగడటం, నచ్చని వాళ్ళని అదే పనిగా విమర్శంచడం భావ్యం కాదు. సోషల్‌ మీడియాలో ఇటువంటి చర్యలు ఎక్కువైపోతున్నాయి.