‘ఆటగాళ్లు’ టీజర్‌

నారా రోహిత్‌, జగపతిబాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బ్రహ్మానందం, సుబ్బరాజు, శ్రీతేజ్‌, చలపతిరావు. నాగినీడు. ప్రియ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా శనివారం ఈ సినిమా టీజర్‌ను రానా విడుదల చేశారు. దీన్ని నారా రోహిత్‌ ఫేస్‌బుక్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా కోసం జగపతిబాబుతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. టీజర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటికి ధన్యవాదాలు తెలియజేశారు.

‘సర్‌ మీ భార్యను చంపింది మీరేనా.. సర్‌ ఇప్పుడు మీరు తీస్తున్న సినిమా ఆగిపోయినట్లేనే. ఇప్పుడు మీ అభిమాభనులకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు’ అనే డైలాగ్స్‌తో టీజర్‌ ప్రారంభమైంది. నారా రోహిత్‌ను విచారిస్తూ జగపతిబాబు కనిపించారు.’ఆట నువ్వు మొదలు పెట్టావు. నేను ఫినిషింగ్‌ ఇస్తాను’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది.