HomeTelugu Newsఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన..ఎన్టీఆర్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన..ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్ట్‌గా పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఎన్టీఆర్‌కు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఖాతాలు ఉన్నాయి. ఇప్పుడు అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా తెరిచారు. తారక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరవగానే 12వేలకు మంది పైగా నెటిజన్లు ఆయన్ను ఫాలో అవడం ప్రారంభించారు. దాంతో ఒక్కరోజులోనే తారక్‌ ఖాతాకు వెరిఫైడ్‌ ఎకౌంట్‌ లభించింది.

12

ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో తారక్‌ ఖాతా ‘jr.ntr@tarak9999’ పేరుతో ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తారక్‌ 9999 పేరుతో ఖాతాను తెరిచారు. ట్విటర్‌లో 2.35 మిలియన్‌ ఫాలోవర్స్‌, ఫేస్‌బుక్‌లో 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మరో విషయం ఏంటంటే..ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చారు. ఆయన కూడా ‘భరత్‌ అనే నేను’ ఫస్ట్‌లుక్‌తోనే ఖాతా తెరిచారు. సోమవారం విలక్షణ నటుడు కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’ ట్రైలర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు.‌

తారక్‌ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్‌ చిత్తూరు యువకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu