చరణ్ రికార్డులకు మహేష్ బ్రేక్!

చిట్టిబాబు పాత్ర ద్వారా రామ్ చరణ్ ‘రంగస్థలం’లో రికార్డులు క్రియేట్ చేస్తాడు అని మెగా అభిమానులు భావిస్తూ ఉంటే ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే మహేష్ ‘భరత్ అనే నేను’, ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ”భరత్ అనే నేను” మూవీలోని తొలి పాట ఆదివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈపాట ద్వారా రామ్ చరణ్ గతవారంలో సృష్టించిన రికార్డులను మహేష్ బ్రేక్ చేసాడు.‘రంగస్థలం’ మూవీలోని ‘ఎంత సంక్కగున్నావే’ పాట విడుదలైన మూడు గంటలలో యూట్యూబ్ లో 10 లక్షల వ్యూస్ సాదిస్తే ‘భరత్ అనే నేను’ మూవీలోని మొదటి పాట విడుదలైన రెండు గంటలలోనే 10 లక్షల మంది యూట్యుబ్ లో చూడటంతో చరణ్ రికార్డ్ లను మహేష్ బ్రేక్ చేసాడు అని మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’ విడుదల అయ్యాక కేవలం మూడు వారాల గ్యాప్ తో మహేష్ సినిమా ‘భరత్ అనే నేను’ విడుదల అవుతున్న పరిస్థుతులలో చరణ్.. మహేష్ ల మధ్య వారి లేటెస్ట్ సినిమాలకు సంబంధించి కలక్షన్స్ ఫిగర్స్ పై ఆసక్తికర చర్చలు జరిగే ఆస్కారం ఉంది.