డియర్‌ కామ్రేడ్‌ విజయ్‌ దేవరకొండ

అర్జున్‌ రెడ్డి చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం అతని ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి. టాక్సీవాలా, గీతా గోవిందం చిత్రాల షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసిన విజయ్‌ తెలుగు, తమిళ మూవీ నోటాలో నటిస్తున్నాడు.. ఇక కొత్త దర్శకుడు భరత్‌ కమ్మతో డియర్‌ కామ్రేడ్‌ మూవీకి సైన్‌ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుంది.


ఈ మూవీ లో కాకినాడకు చెందిన యువకుడిగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు జంటగా ఛలో ఫేమ్‌ రష్మిక మందన నటిస్తున్నది. ఆమె ఈ మూవీలో క్రికెటర్‌గా కనిపించనుంది. ఇక ఈ మూవీ పూజా కార్యక్రమాలు రేపు నిర్వహించనున్నారు. ఇక వెంటనే షూటింగ్‌ పనులు ప్రారంభంచినున్నారు.