బన్నీ ఐటెమ్ సాంగ్ కు ఓకే చెబుతాడా..?

అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘నా పేరు సూర్య’. ప్రస్తుతం
ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్ 26న ఈ సినిమా ప్రేక్షకుల
ముందుకు రానుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో రొమాన్స్ కూడా మిక్స్ చేసినట్లు
తెలుస్తోంది. అల్లు అర్జున్ తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో
అతడు ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ పెట్టాలని భావించాడు. అయితే డిఫరెంట్ జోనర్ లో నడిచే
ఈ సినిమాకు ఐటెమ్ సాంగ్ పంటి కింద రాయిలా అభిమానులు భావించే అవకాశాలు ఉన్నాయనే
ఆలోచనలు చిత్రబృందంలో కలుగుతున్నాయి.
నిజానికి ఐటెమ్ సాంగ్ సినిమా ప్రీప్రొడక్షన్ స్టేజ్ లోనే ప్లాన్ చేశారట. దానికి తగ్గట్లుగా ఒక పాటను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు సినిమాపై క్రియేట్ అయిన బజ్ కారణంగా బన్నీ, వక్కంతం వంశీ డైలమాలో పడినట్లు సమాచారం. సాధారణంగా బన్నీ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చాలా ఫేమస్. అదొక సెంటిమెంట్ గా భావిస్తాడు. మరి ఈ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!