బాలయ్యతో సంపత్ నంది!

బాలయ్యతో సంపత్ నంది!
మాస్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు సంపత్ నందికి ఈ మధ్య కాలంలో సరైన హిట్టు సినిమా దక్కలేదు. గోపీచంద్ తో రూపొందించిన ‘గౌతమ్ నందా’ కూడా బోల్తా కొట్టింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని కథ సిద్ధం చేసిన ఈ డైరెక్టర్ ఈసారి నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని చూస్తున్నాడు. బాలయ్యకు కథ చెప్పాలనుకుంటున్నట్లు ఆయనకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. కథ నచ్చితే సినిమా చేయడానికి బాలయ్య కూడా ఆసక్తిగానే ఉన్నాడు.
ఇటీవల ‘జై సింహా’ చిత్రంతో సక్సెస్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే బోయపాటితో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. సంపత్ గనుక తన కథతో మెప్పిస్తే ఈ కాంబో సెట్ అవ్వడం ఖాయం. అన్నీ కుదిరితే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయి.