మణిరత్నం ‘నవాబ్’ ట్రైలర్‌

లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘నవాబ్’‌. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అరవింద్‌ స్వామి, శింబు, అరుణ్ విజయ్‌, విజయ్‌ సేతుపతి, ప్రకాష్ రాజ్‌ ఇలా భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాని తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ అఫీషియల్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో నవాబ్ అంటే రాజు అనే అర్ధం ఉంది. పెద్దాయన అనే అర్ధం కూడా ఉంది. పెద్దాయన ఎవరు.. రాజకీయ వేత్తా, బిజినెస్ మెన్ నా.. లేక ఎవరు అనే డైలాగ్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పెద్దాయన పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నారు. అయన చుట్టూ ఎప్పుడు నలుగురు ఉంటారు. ఆ ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఆయన కొడుకులు. నాలుగో వ్యక్తి పోలీస్ విజయ్ సేతుపతి.

కాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున రిలీజ్‌ చేయగా తమిళ వర్షన్‌ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తుండగా మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.