HomeTelugu Big Storiesరివ్యూ: శమంతకమణి

రివ్యూ: శమంతకమణి

నటీనటులు: నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది, రాజేంద్రప్రసాద్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
ఈ మధ్య టాలీవుడ్ లో ట్విస్టులతో కూడిన కామెడీ సినిమాలకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. దీంతో దర్శకులు కూడా ఈ తరహా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలో వచ్చిన తాజా చిత్రం ‘శమంతకమణి’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
1940 కాలం నాటి శమంతకమణి అనే రోల్స్ రాయిస్ కారును ఓ ధనవంతుడు(సుమన్) 5 కోట్లకు కొనుగోలు చేస్తాడు. ఆయన కొడుకు కృష్ణ(సుధీర్ బాబు) హైదరాబాద్ లో పెద్ద పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో శమంతకమణిని ఎవరో దొంగతనం చేస్తారు. ఆ కారుని ఎవరు దొంగతనం చేశారో.. తెలుసుకోవడానికి ఎస్.ఐ.రంజిత్ కుమార్ విచారణ చేపడతారు. ఆ పార్టీలో అనుమానాస్పదంగా కనిపించిన ఉమామహేశ్వరరావు(రాజేంద్రప్రసాద్‌), శివ(సందీప్‌ కిషన్‌), కార్తీక్‌(ఆది) అదుపులోకి తీసుకుంటారు. ఏదొకటి చేసి జీవితంలో సెటిల్ అవ్వాలనేది ఈ ముగ్గురి ఆలోచన. రంజిత్ కూడా అలానే ఆలోచిస్తాడు.
మరి ఈ నలుగురికి శమంతకమణితో ఉన్న సంబంధం ఏంటి..? ఆ కారుని ఎవరు దొంగతనం చేశారు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

ప్లస్ పాయింట్స్:
కథనం
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
నలుగురు హీరోలు
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్
విశ్లేషణ:
కారు దొంగతనం చుట్టూ అల్లిన కథలో అంత బలం లేకపోయినప్పటికీ దర్శకుడు తన కథనంతో నడిపించేశాడు. తొలి భాగం మొత్తం పాత్రల పరిచయాలు, వారి స్వభావం వంటి వాటితో గడిపేశాడు. ఇక సినిమాకు ప్రధాన బలం సెకండ్ హాఫ్. దర్శకుడు తన పనితనాన్ని మొత్తం సెకండ్ హాఫ్ లో చూపించాడు. నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీను ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టినా.. సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. ఎన్నో మలుపులతో ఆధ్యంతమ్
సినిమా ఆసక్తిగా సాగిపోతుంది. దీనికి తగ్గ కామెడీ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుంది. పతాక సన్నివేశాల కోసం కథ రాసుకున్నాడనిపిస్తుంది. సినిమాలో నలుగురు హీరోల పాత్రలు కూడా ఒకరిది తక్కువ ఒకరిది ఎక్కువ అని లేదు. సమాన ప్రాముఖ్యనిచ్చారు. సుధీర్ బాబు పాత్రను బాగా డిజైన్ చేశారు. ఎమోషన్స్ ను బాగా పండించాడు. సందీప్ కిషన్, ఆది పాత్రలు చాలా సరదాగా ఉంటాయి. నారా రోహిత్ ఎప్పటిలానే ఎనర్జిటిక్ గా నటించాడు. రాజేంద్రప్రసాద్, రంజితల లవ్ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ లో కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించి ఉంటే సినిమా ఇంకా బావుండేది. అయినప్పటికీ సెకండ్ హాఫ్ తో మ్యాజిక్ చేసి సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు. నిర్మాణ విలువలు బావున్నాయి.
రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu