‘రంగస్థలం’లో ఎన్టీఆర్!

రామ్ చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. ఈ సినిమా 1980లలో సాగే సినిమా కావడంతో అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా చూపించాబోతున్నారు.
అప్పటి రాజకీయాల్లో ఎన్టీఆర్ తన చట్రం తిప్పిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎన్టీఆర్ కనిపించే సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని సమాచారం. ఆయన తెరపై కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయని టాక్. ఈ సినిమాలో చరణ్ చెవిటి వాడి పాత్రలో కనిపిస్తుండగా సమంత పాత్ర కూడా వైవిధ్యంగా ఉండబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, టీజర్లకు విశేష స్పందన లభిస్తోంది.