చరణ్, సమంతల మధ్యలో మూడో వ్యక్తి!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపమున్న వ్యక్తిగా కనిపించనున్నాడు. సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తరువాత చాలా మంది ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా. సినిమాలో చరణ్ మాట్లాడతాడు కానీ ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను సరిగ్గా అర్ధం చేసుకోలేడు. అటువంటి కుర్రాడి ప్రేమలో పడిన హీరోయిన్ సమంత తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుంది..? తన భావాలని ఎలా పంచుకుంటుందనే..? విషయాలు ఆసక్తికరంగా మారాయి.
అయితే చరణ్-సమంతల ప్రేమకు మధ్యవర్తిగా ఓ నటుడు ఉంటాడట. ఆ పాత్ర సినిమాకు కీలకం అంటున్నారు. సమంత చెప్పే మాటలను రామ్ చరణ్ కు సైగల ద్వారా అర్ధమయ్యేలా చెబుతుంటాడట ఈ మీడియేటర్. ఈ క్యారెక్టర్ కామెడీ పండించడంతో పాటు ఓ కథలో కీలకపాత్ర పోషిస్తుందని సమాచారం. అయితే ఆ పాత్రలో ఎవరు కనిపించనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ వారంలోనే సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభం కానుంది. అక్కడే రామ్ చరణ్ మీద ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు.