రిటైర్మెంట్‌ ను ప్రకటించిన కమల్‌!

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ రాజకీయాలలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే..అయితే ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. ఈ మధ్యనే తను కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ(మక్కల్‌ నీది మయమ్‌) పేరును ప్రకటించారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత పనులో తో పాటు అతని చేతిలో ఉన్న సినిమాలు విశ్వరూపం2, శభాష్‌ నాయుడు, భారతీయుడు సీక్వేల్స్‌ను పూర్తి చేసే బిజీగా ఉన్నాడు.

సోషల్‌ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉండే కమల్‌ తన ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ నేపధ్యంలో ఓ అభిమాని మీరు సత్యజిత్‌ రేఎం, శ్యామ్‌ బెంగాల్‌ వంటి దర్శకులతో పనిచేయకపోవడం పై బాధపడుతున్నారా అని అడగ్గా కమల్‌ సమాధానం ఇస్తూ వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ ఎప్పుడు వాళ్ళు నాకు సినిమా ఆఫర్‌ ఇవ్వలేదు. పైగా సత్యజిత్‌ రే ఇప్పడు లేరు. నేను కూడా ఇకపై సినిమాలు చేయబోవడం లేదు అని తన రిటైర్మెంట్‌ ను ప్రకటించాడు.