వదిన గారు పై పిన్నిగారు బిగ్‌బాంబ్‌

బిగ్‌బాస్‌ షోలో నాని తన హోస్టింగ్‌తో రోజురోజుకు మసాలా ఎడ్‌ చేస్తు వస్తున్నాడు. ఈ రోజు ఆదివారం కావడంతో నాని ఇంటిసభ్యుతో చర్చించారు. ఒకరి పై ఒకరికి ఉన్న ఆరోపనలను తొలగించే ప్రయత్నం చేశాడు. కాగా ఇంటి సభ్యులకు సింహాసనం టాస్క్‌ ఇచ్చాడు. ఇంట్లో ప్రతి సభ్యుడికి తమ విలన్‌ ఎవరో తెలియజేసి తన కిరటం పెట్టి, ఆ సింహాసనం పై కూర్చోబట్టాలని చెప్పాడు.

ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఈ వారం కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఉండగా శ్యామల, దీప్తి, నందిని రాయ్‌లు తప్ప మిగిలిన వారు అందరు సెఫ్‌ జోన్‌లో ఉన్నారు. కాగా ఈ రోజు బిగ్‌బాస్‌ దీప్తి, శ్యామల, నందిని తక్కువ ఓట్లుతో ఎలిమినేషన్‌లో ఉండగా తేజస్వీ, కౌశిల్‌ తమ దగ్గర ఉన్న ఫవర్‌తో నందిని, దీప్తి ని రక్షించారు. శ్యామల ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేటే అయ్యారు. అయితే పిన్నిగారు వెళ్లూ… వదిన గారైన దీప్తి పై బిగ్‌ బాంబ్‌ విసిరింది. ఈ వారం అంత ఇంటి సభ్యులందరి బట్టలు ఉతకాలి.