శ్రీదేవి నాదగ్గరే పడుకునేది: రమాప్రభ

సీనియర్ నటి రమాప్రభ ఇటీవల జరిగిన ఓ షోలో పాల్గొన్న ఆమె తన నటజీవితంలో జరిగిన విశేషాలను వెల్లడించారు. దివంగత నటి శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే శ్రీదేవి 30ఏళ్ల కిందటే చనిపోయిందని అన్నారు. శ్రీదేవితో కలిసి పలు సినిమాల్లో నటించారు కదా! ఆమె చనిపోయినపుడు మీకెలా అన్న ప్రశ్నకు రమాప్రభ సమాధానమిచ్చారు. ”చిన్నప్పుడు శ్రీదేవితో కలిసి ఐదారు సినిమాల్లో నటించా. అప్పుడు నాదగ్గరే పడుకునేది. శోభన్‌బాబు హీరోగా రామానాయుడుగారు నిర్మించిన సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమాలో నేను ఆమె తల్లిగా నటించా.

ఆవిడ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో ఆమె అమ్మ ఎవరితోనూ కలవ నిచ్చేది కాదు. శ్రీదేవి చిన్నప్పటి నుంచి మంచిగా డ్రెస్‌ చేసుకోవడం.. మేకప్‌ వేసుకోవడం.. నటించడం… అంతే! ఇవి తప్ప వేరే సంతోషాలు, ఆనందాలు లేవు. పెళ్లి తరువాత కూడా ఆమెది అదే పరిస్థితి. స్నేహితులతో గడపడం, సుఖ, దుఖలను పంచుకోవడం లాంటివీ ఏమీ లేవు. నేను అందరితోనూ నటించాను కాబట్టి, ఏది జరిగినా ఈ ఫిలింగ్‌ నాకూ ఉంటుంది. శ్రీదేవి చనిపోయినప్పుడు బ్లాంక్‌ అయిపోయాను.