సల్మాన్ తన భర్త అంటూ యువతి హంగామా!

బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. ఎంత గొప్ప సినీమా నటుడు అయినా..ఎన్నో వివాదాలకు కేంద్ర బింధువు సల్మాన్. తాజాగా సల్మాన్ ఖాన్ తన భర్త అంటే ఓ యువతి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో ఇటీవల ఈ సంఘటన జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా అపార్ట్ మెంట్ పైభాగానికి ఆ యువతి చేరుకుంది. సల్మాన్ తన భర్త అంటూ కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి యువతిని కిందకు దింపే ప్రయత్నం చేశారట. యువతి మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి చుక్కలు చూపించిందట. ఆమె తన వెంట రాడ్లతో బెదిరింపులకు దిగింది. దగ్గరికి వస్తే పొడచుకుని చనిపోతానంటూ హెచ్చరించింది. ఇక చేసేదేం లేక ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా… వారు స్పాట్‌కు వచ్చారు. మొత్తానికి ఆ యువతికి సర్థిచెప్పి మెల్లిగా కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట.