‘జర్నీ2’ విడుదలకు సిద్ధం!

గ‌ణేశ్ క‌థానాయ‌కుడిగా మంజ‌రి, మాళ‌విక నాయిక‌లుగా న‌టించిన చిత్రం ‘జ‌ర్నీ – 2’. శాఖ‌మూరి కృష్ణ‌చైత‌న్య స‌మ‌ర్పిస్తున్నారు. జ‌య‌ల‌క్ష్మీ ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. చిగులూరి గంగాధ‌ర‌రావు చౌద‌రి నిర్మిస్తున్నారు. ఎస్.నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం గురించి హైద‌రాబాద్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం విలేక‌రుల స‌మావేశం జ‌రిగింది.
శాఖ‌మూరి కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ.. ”ఇందులో నాలుగు పాట‌లున్నాయి. ఈ నెల 30న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. గ‌ణేశ్‌కి క‌న్న‌డ‌లో పెద్ద మార్కెట్ ఉంది. ఆయ‌న ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలున్నాయి. మంజ‌రి తెలుగువారికి బాగా సుప‌రిచితురాలే. యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యే సినిమా అవుతుంది” అని చెప్పారు.
నిర్మాత చిగులూరి గంగాధ‌ర‌రావు మాట్లాడుతూ.. ”స్వార్ధం లేని, నిజాయితీతో కూడుకున్న ప్రేమికుల మధ్య జరిగే సాగే చక్కటి ఇతివృత్తమే ఈ సినిమా. అనువాద ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి” అని అన్నారు.
సినిమా పెద్ద హిట్ కావాల‌ని మ‌ల్కాపురం శివ‌కుమార్ అభిల‌షించారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, కెమెరా: జగదీష్ వలి, ఎడిటింగ్:
ఇ.ఎం.నాగేశ్వరావు, సమర్పణ: శాఖమూరి కృష్ణచైతన్య, నిర్మాత: చిగులూరి గంగాధరరావు చౌదరి,
సంగీతం,కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎస్.నారాయణ.

CLICK HERE!! For the aha Latest Updates