HomeTelugu News'అఖిల్ 3' టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్

‘అఖిల్ 3’ టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్

అక్కినేని అఖిల్‌ తెరంగేట్రం చేసిన తొలి ‘A అఖిల్‌’ సినిమాతోనే తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే రెండోవ చిత్రం ‘హలో’ కూడా పర్వాలేదనిపించిన్న తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు అఖిల్‌. దీంతో అఖిల్‌ తన మూడో సినిమాపై ఆసక్తి నెలకొంది. అఖిల్ ప్రస్తుతం తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

6 26

కాగా ఈ సినిమాకు మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేకపోయినా.. అఖిల్ 3 టీజర్‌తో నాగ్‌కు బర్త్‌డే విషెస్ తెలిపేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. టైటిల్‌, అఖిల్‌ లుక్‌తో పాటు సాంగ్‌ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu