HomeTelugu Newsఎన్టీఆర్‌ బయోపిక్ లో బాలకృష్ణ ఫస్ట్ లుక్‌

ఎన్టీఆర్‌ బయోపిక్ లో బాలకృష్ణ ఫస్ట్ లుక్‌

5 13

ఎన్టీఆర్‌ జీవిత కథను ఆధారంగా నందమూరి బాలకృష్ణ .. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ మేరకు రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎన్టీఆర్ ఆహార్యంలో ఉన్న బాలయ్య ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితమే నటుడు రానా రివీల్ చేశారు. అందులో బాలయ్య అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్ లానే కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన జీవితంలోని సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అవరసమైన మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రలను కూడా చూపించబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu